Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్,ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి
నవతెలంగాణ-ఆమనగల్
దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని కల్వ కుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆమనగల్ పట్టణంలో శనివారం విశ్వకర్మ జయంతి వేడు కలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వ హించిన యజ్ఞమహౌత్సవం, విశ్వకర్మ జెండా ఆవిష్కరణ తదితర కార్యక్రమాలకు ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరై మాట్లాడారు. అంతకుముందు సంఘం సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం ఆవ రణలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. కార్యక్రమంలో భాగంగా సంఘం సభ్యులు ఎమ్మె ల్యే, ఎమ్మెల్సీ తదితరులను పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు అను రాధ పత్య నాయక్, విజితా రెడ్డి, ఆమనగల్ మార్కెట్ కమి టీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ తోట గిరి యాదవ్, మాజీ సర్పంచ్ గుర్రం కరుణశ్రీ కేశవులు, విశ్వ కర్మ సంఘం అధ్యక్షుడు పోలోజు బ్రహ్మం, ప్రధాన కార్య దర్శి రామాచారి, కోశాధికారి దార్ల రామకష్ణ చారి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి కాసోజు రాము (గోల్డ్ రాము), నాయకు లు రవికిరణ్, చంద్రమౌళి చారి, వివేకానంద చారి, స్వర్ణ కార సభ్యులు జగదీశ్వరాచారి, శంకరాచారి తదితరులు పాల్గొన్నారు.