Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిజాంకు వణుకు పుట్టించిన చరిత్ర తెలంగాణ ప్రజలది
- జడ్పీ కార్యాలయంలో జాతీయ జెండాను అవిష్కరించిన
- రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగాల అనితాహరినాథ్రెడ్డి
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
నిజాం నియంత పాలన నుంచి తెలంగాణ ప్రాంతా నికి విముక్తి కల్పించేందుకు.. ఎంతో మంది నాయకులు అమరులైయ్యారని, అమరుల త్యాగాల ఫలితంగా రాచరిక పాలన నుంచి ఈ ప్రాంతం విముక్తి పొందిందని రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగాల అనితాహరినాథ్రెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ సందర్భంగా శనివారం జడ్పీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగుర వేసి, అమరులకు నివాళిల్పరించారు. ఈ సందర్భంగా అనితాహరినాథ్రెడ్డి మాట్లాడుతూ నిజాంకి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో పాటు 1948 సెప్టెంబర్లో ఆపరేషన్ పోలో పేరుతో అప్పటి కేంద్ర హౌంమంత్రి సర్దార్ వల్లభారు పటేల్ సైనిక చర్య వలన కేంద్ర బలగాలు రజాకార్ల పైన పోరాడి విజయం సాధించారన్నారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రజాకార్లతో పోరాడి అమరులైన వాళ్ళని స్మరించుకుని వారి స్పూర్తితో ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉం దన్నారు. అందుకే ప్రజల్లో ఏ వర్గ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర రథసారథి సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 16, 17, 18 తేదీ లను జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరపాలని నిర్ణయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, జడ్పీటీసీలు తాన్వి రాజ్, విశాల తాండ్ర, జంగమ్మ, శ్రీకాంత్, అవినాష్రె డ్డి, జడ్పీ సీఈఓ దిలీప్ కుమార్, డిప్యూటీ సీఈఓ రంగారావు, జిల్లా పంచాయితీ రాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారి సురేష్ చంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.