Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ జెండా ఎగురవేసిన మంత్రి సబితాఇంద్రారెడ్డి
- అశ్వదళంతో ఘన స్వాగతం పలికిన పోలీసు బలగాలు
- పోలీసుల గౌరవ వందనాన్నిస్వీకరించిన మంత్రి
నవతెలంగాణ - రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు శని వారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రం గారెడ్డి జిల్లా నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సము దాయంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ముందుగా మంత్రికి అశ్వదళంతో ఘన స్వాగతం పలికారు. మంత్రి సబితారెడ్డి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్ర మంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం, రాచకొండ సీపీ మహేష్ భగవత్, అడిషనల్ కలెక్టర్లు తిరుపతి రావు, ప్రతీక్ జైన్, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, ఆర్డీఓ వెంకటాచరి, ఏఓ ప్రమీల, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.