Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్‌హెచ్‌పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొడవత్ ఉమ్లా నాయక్
నవతెలంగాణ - శంషాబాద్
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబ డిన గిరిజనులకు సీఎం కేసీఆర్ ప్రకట న గిరిజనుల భవిష్యత్తుకు కొండంత బలాన్ని స్తుందని లంబాడీ హక్కుల పోరాట సమితి(ఎల్‌హె చ్పిఎస్) రం గారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొడవత్ ఉమ్లా నాయక్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవంలో భాగంగా సీఎం శనివారం హైదరాబాద్ నగరంలో బంజారా భవన్, ఆదివాసీ భవన్లను ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆ ర్ గార్డెన్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం గిరిజనులకు 10 శాతం విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్, భూమి లేని పేదలకు దళిత బంధు మాదిరిగానే గిరిజన బంధు ఇస్తామని ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఉమ్లా నాయక్ మాట్లాడుతూ తెలంగా ణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనను సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా అపరి ష్కృతంగా ఉన్న పోడు భూము లకు పట్టాలు మంజూరు చేసి రైతుబంధు, రైతుబీమా పథకం అమలు చేస్తామని చెప్పడంతో తెలంగాణలో గిరిజనులకు మంచి రోజులు వచ్చా యన్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ఒకసారి మాట ఇస్తే ఆ మాట కోసం ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని సాధించే సత్తా ఉందన్నారు. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పాటు తరువాత గిరిజనుల అభివృద్ధి కోసం అనేక చర్యలు తీ సుకున్నారన్నారు. 5 వందల జనాభా కలిగిన గిరిజన తండాలను గ్రామపం చాయతీలుగా మార్చి గిరిజనుల ఆత్మగౌర వాన్ని నిలబెట్టారని కొనియాడా రు. ఆల్ ఇండియా బంజారా సంక్షేమ సంఘం (బిఐఎస్ఎస్)తరఫున సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.