Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శంషాబాద్
శంషాబాద్ ఎయిర్పోర్టులో వివిధ రూపాల్లో అక్రమ బంగారాన్ని తరలిస్తున్న ముగ్గురు ప్రయాణికులు అదుపులోకి తీసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు శనివారం తెలిపారు దుబారు నుంచి ఆర్జిఐ ఎయిర్పోర్టుకు వచ్చిన ఓ మహిళ ప్రయాణికురాలుని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసి 12 87 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. వెంటనే బంగారాన్ని స్వాధీనం చే సుకున్న కస్టమ్స్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తు న్నారు. గోల్డ్ విలువ రూ.67.56 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు.
మరో ఘటనలో
దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకులను నుండి రూ.25.74 లక్షల విలువైన 498.290 గ్రాముల 24 కే టీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికులు ధరించే లోదుస్తులు, చొక్కాలలో స్ప్రేలో చేసి బంగారాన్ని దాచిపెట్టారు. సదరు బంగారాన్ని సీజ్ చేసి ప్రయాణికులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.