Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేశంపేట
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఆదివాసి, గిరిజన సమ్మేళనానికి కేశంపేట మండలం నుంచి శనివారం గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా మండల పరిదిలోని ఎక్లాస్ఖాన్పేట గ్రామంలో ఎంపీపీ రవీందర్ యాదవ్ వాహనశ్రేణిని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రవిచంద్రకుమార్ రెడ్డి, ఏపీఎం భగవంతు, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు మురళీధర్ రెడ్డి, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, గిరిజన మహిళలు తరలి వెళ్లారు.