Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి
- కాంగ్రెస్ డిజిటల్ మెంబర్ షిప్ఇన్సూరెన్స్ కార్డులు పంపిణీ
నవతెలంగాణ-కుల్కచర్ల/చౌడపూర్
రానున్న రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం కుల్కచర్ల, చౌడాపూర్ మండలలో కాంగ్రెస్ సభ్యత్వం, ఇన్సూరెన్స్ కార్డులను పరిగి మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు టి.రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలకు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒకరికి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి మరణిస్తే వారికి రూ. 2లక్షల ఇన్సూరెన్స్ వర్తిస్తుందని తెలిపారు. కార్యకర్తలను పేద ప్రజలను కాంగ్రెస్ గుండెలో పెట్టుకుని చూసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, మండల అధ్యక్షులు బిఎస్ ఆంజనేయులు, బ్లాక్ బి అధ్యక్షులు కర్రే భరత్‌కుమార్, ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, మాజీ ఎంపీపీ ఆంజనేయ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు వెంకటయ్య గౌడ్, ఎస్సీ సెల్ కార్యదర్శి ఆర్ వెంకట్, స్థానిక ఎంపిటిసి ఆనందం, మండల మహిళ అధ్యక్షురాలు లక్ష్మీ ఆనంద్, కుసుమ సముద్రం సర్పంచ్ అన్నమయ్య, ముజాహిద్పూర్ గ్రామ ప్రధాన కార్యదర్శి వేముల రాములు వివిధ గ్రామాల బూత్ కమిటీ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కుమ్మరి స్వామి,.మండల ఉపాధ్యక్షులు, హరినాథ్ రెడ్డి, చౌడాపూర్ మండల అధ్యక్షులు ఎల్ప టి అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి, మండల మహిళ అధ్యక్షురాలు సరిత, గ్రామ కమిటీ అధ్యక్షులు యాదయ్య, యూత్ అధ్యక్షులు మసయ్య, ఉపాధ్యక్షులు నరసింహ నాయక్, రాములు, వర్కింగ్ ప్రెసిడెంట్ సలీం, వెంకటయ్య గౌడ్, కిసాన్ సెల్ అధ్యక్షులు మాసయ్య, బీసీ సెల్ అధ్యక్షులు లింగం, మైనార్టీ సెల్ అధ్యక్షులు రషీద్, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు నరేష్, చాకల్‌పల్లి శేఖర్, చంద్రశేఖర్, మరికల్ చారి, రమోహన్, శర్మ, నరేందర్, సత్యం, కొత్తపల్లి శ్రీను, సతీష్, శ్రీనాథ్, వెంకట్, నిల్య నాయక్, నూర్యనాయక్, రామారావు, రమేష్, స్వామి, సుమంత్, నర్సింలు, అనంతరెడ్డి, మండల నాయకులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.