Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాచారం
సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం రంగారెడ్డి జిల్లా సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షునిగా కే బాబయ్య, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సాబేర్, సంఘం ఆర్గనైజేషన్ సెక్రటరీగా సిద్ధార్థ, ఉపాధ్యక్షునిగా తిరుపతయ్యలతో పాటు మరి కొంతమంది ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మహమ్మద్ సాబేర్ మాట్లాడుతూ వ్యాయామ విద్య ఉపాధ్యాయుల సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. వ్యాయామ విద్య ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి వారి సంక్షేమానికి కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. నేను పీఈటీ గా యాచారం మండల పరిధిలోని చింతపట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నానని ఆయన వివరించారు. కార్యక్రమంలో సంఘం నూతన కమిటీ ఎన్నికైన సభ్యులు పాల్గొన్నారు.