Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-ఆమనగల్
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి అంబే ద్కర్ పేరు పెట్టడం హర్షనీయమని టీఆర్ఎస్ రాష్ట్ర నా యకులు గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆమన గల్ పట్టణ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక నాయకులతో కలిసి రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. నూ తన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంతో పాటు నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బడుగు బలహీన వర్గాలకు సముచిత గౌరవం ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనలో నేటి యువత భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఆయన మైసిగండిలో జరిగిన మాడ్గుల మండలం టీఆర్ఎస్ యూత్ వింగ్ ప్రెసి డెంట్ నాగిళ్ళ మహేష్ కుమారుని జన్మదిన వేడుకల్లో పాల్గొని చిరంజీవి ఘగన్ను ఆశీర్వదించారు. కార్యక్రమం లో జిల్లా పరిషత్ గ్రామీణాభివృద్ధిశాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులు, కడ్తాల్ మండల జెడ్పీటీసీ సభ్యులు జర్పుల దశర థ్నాయక్, సర్పంచ్ గోరటి శ్రీనివాస్, పీఏసీఎస్ డైరెక్టర్ నాగులు నాయక్, ఏఎంసీ డైరెక్టర్ సురమల్ల సుభాష్, టీ ఆర్ఎస్ తలకొండపల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ టి. చంద్రశేఖర్ రెడ్డి, ఆమనగల్ రైతు సంఘం అధ్యక్షుడు రూ పం వెంకట్ రెడ్డి, నాయకులు కొండల్, అహ్మద్, వడ్డేమని శివకుమార్, చలిచీమల సతీష్, సుమన్ నాయక్, గణేష్ నాయక్, చింటూ, గిరి, గణేష్ పాల్గొన్నారు.