Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.చంద్రమోహన్
- ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక
నవతెలంగాణ-ఆమనగల్
మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న పంచా యతీ కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.చంద్రమోహన్ డిమాండ్ చేశారు. తలకొండపల్లి మండల కేంద్రం సమీ పంలోని దేవకీ గార్డెన్లో 2 రోజులుగా కొనసాగుతున్న గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ జిల్లా 3 మహాసభలు ఆదివారం ముగిసాయి. ముగింపు సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 5 వేలకు పైగా కార్మికులు పనిచేస్తుండగా ప్రభు త్వ రికార్డు ప్రకారం 3,600 మంది కార్మికులు ఉన్నట్టు ప్రభుత్వ నివేదికలు ఉన్నాయని ఈ విషయంలో కార్మికుల్లో ఉన్న ఆందోళనను తొలగించాలన్నారు. కార్మికులతో అదనంగా ప్రభుత్వ భవనాల్లో, పాఠశాలలో పనులు చెబు తూ వారికి అధిక పనిభారాన్ని కల్పిస్తున్నారని ఆయన ఆవే దన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 60 ప్రకారం కేటగిరీల వారీగా కార్మికులకు రూ. 15, 600, కారోబార్ బిల్ కలెక్టర్కు రూ.19, 500, కంప్యూటర్ ఆపరే టర్, ఇతర పరిపాలన విభాగంలో పని చే స్తున్నవారికి రూ.22, 750 వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 51ని సవ రించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని తొలగించి కేటగిరి విధానాన్ని అమలు చేయాలని, కార్మికులకు పిఎఫ్, ఈఎస్ ఐతోపాటు రూ.10 లక్షల ఇనూ ్సరెన్స్ సౌకర్యం కల్పించాలని ఆయన పేర్కొ న్నారు. సమావేశంలో భాగంగా పంచా యతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూని యన్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా వై. అశోక్, కార్య దర్శిగా గ్యార పాండు, దీనితో పాటు 8 మంది ఆఫీస్ బేరర్లను, 27 మందిని జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్ను కున్నారు. సీఐటీయూ రాష్ట్ర నాయకులు పి.సుధాకర్, జిల్లా కోశాధికారి ఎన్. మల్లేష్, జిల్లా నాయకులు బి.సాయి బాబా, రామ్మోహన్, జిల్లా కమిటీ సభ్యులు గుమ్మడి కురుమయ్య, ఆయా మండలాల కన్వీనర్లు ఏ.శేఖర్, బుగ్గ రాములు, దేవేందర్, కార్మికులు పాల్గొన్నారు.