Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛాతీ, మెడపై కత్తితో దాడి
నవతెలంగాణ- షాబాద్
కట్టుకున్న భార్యపై కసాయి భర్త హత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శని వారం చోటు చేసుకుంది. షాబాద్ పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..మండల పరిధి లోని కేశవగూడా గ్రామానికి చెందిన తోటమీది జంగయ్య కూతురు ప్రేమలతను షాబాద్‌కు చెందిన బేగరి యాద య్య (రాజు)కు 7 ఏండ్ల క్రితం వీరికి వివాహం అయింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్నేండ్ల నుండి భార్య ప్రేమలతపై అనుమానం పెంచుకున్న భర్త శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేసేవాడు. భర్తపెట్టే బా ధలు భరించలేక ప్రేమలత తల్లిగారింటికి వెళ్లింది. దీంతో మరింత కక్ష పెంచుకున్న యాదయ్య, పథకంమేరకు కత్తి తీసుకొని అత్తగారింటికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న ప్రేమలతను చూసిన యాదయ్య కోపంతో రగిలిపోయే తన దగ్గర ఉన్న కత్తితో మెడపై, చాతిపై దాడి చేశాడు. అరుపులువిన్న కు టుంబసభ్యులు అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించగా ఇక్కడ నుండి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన ప్రే మలతను శంషాబాద్‌లోని హాస్పటల్లో చికిత్స నిర్వహిస్తు న్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.