Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్
నవతెలంగాణ-దోమ
మండలంలో వీఆర్ఏల నిరవధిక సమ్మెకు సంఘీ భావంగా లంబాడి హక్కుల పరాట సమితి, గిరిజన విద్యార్థి సంఘం నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయాసంగా నాయకుడు మాట్లాడుతూ.. వీఆర్ఏల పే స్కేల్ పెంచాలని 55 ఏండ్లు దాటిన వారికి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. వీఆర్ఏలకు నిరవదికసమ్మెకు కేసీఆర్ ప్రభుత్వం స్పందించకుంటే వీఆర్ఏలకు మద్దతుగా గిరిజన విద్యార్థి సంఘం, లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గోవింద్ నాయక్, జిల్లా అధ్యక్షులు సూర్య నాయక్, గిరిజన విద్యార్థి సంఘం మండల అధ్యక్షుడు సునీల్ నాయక్, డిఎస్పి నాయకులు, బిఎస్పి నాయకులు మల్లన్న, వీఆర్ఏలు, తదితరులు పాల్గొన్నారు.