Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బీజేపీ ఆటలు సాగనివ్వం
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు జాన్ వెస్లీ
- తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తి తో పోరాటాలు కొనసాగిస్తాం
- జిల్లా ప్రధాన కార్యదర్శి కాడిగల్ల భాస్కర్
నవతెలంగాణ-మంచాల
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్త న్న బీజేపీ ఆటలు రాష్ట్రంలో సాగనివ్వబోమని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌వెస్లీ అన్నారు. శనివారం రాత్రి మండల పరిధిలోని ఆరుట్లలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపుసభ జరిగింది. ఆయన మాట్లాడుతూ మహత్తర పోరాటమై రైతాంగ సా యుధ పోరాటాన్ని హిందూ, ముస్లింల మధ్య జరిగిన పో రాటమని బీజేపీ వాస్తవ చరిత్రను ప్రచారం చేయడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో బీజేపీ కుల, మతాలమధ్య చిచ్చుపెట్టీ అల్లర్లు సృష్టించి, హిందువుల ఓట్లను దండు కుని అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలకు రైతాంగ సాయుధ పోరాటంపై పూర్తి అవ గాహన ఉందన్నారు. 2 సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిత్యవసర ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేసి ప్రజల నడ్డివిరిచిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేట్ పరం చేసిందని, కార్మిక చట్టాలను రద్దు చేసిందన్నారు. మహిళలపై ఎస్సి, ఎస్టిలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో పూర్తిగా విఫలమైందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కాడిగల్ల భాస్కర్ మాట్లాడుతూ రంగా రెడ్డి జిల్లా లో రానున్న రోజుల్లో రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో పోరాటాలు నిర్వహిస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా హైదరా బాద్‌కు దగ్గరలో ఉండటంతో భూముల ధరలు అధికంగా పెరగాయని, భూ బకాసూరుల కన్ను రంగారెడ్డి జిల్లా భూ ములపై పడిందన్నారు. భూ బకాసురుల ఆటలు సీపీఐ (ఎం) సాగనివ్వదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అసైన్డ్ భూ ములకు, సీలింగ్ భూములకు, బాండెడ్ లేబర్ భూములకు నూతనపాస్బుక్కులు ఇవ్వలేదన్నారు. భూములున్న రైతుం దరికి సీపీఐ(ఎం) అండగా ఉంటుందన్నారు. సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పి.జంగా రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి. యాదయ్య, బి.స్వామేల్, రాజు, డిజగదీష్, మండల కార్యదర్శి నాగిల్ల శ్యామ్‌సుందర్, జిల్లా కమిటీ సభ్యులు డి.రాంచందర్, కే.శ్రీనివాస్ రెడ్డి, జీ.నర్సింహ, డి.కిషన్, పి.అంజయ్య, కే.జగన్, యాచారం మండల కార్యదర్శి ఎ.నర్సింహ, ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి సిఎచ్ జంగయ్య, అబ్దుల్లాపూర్ మెట్ మండల కార్యదర్శి ఇ నర్సింహ, పిఎన్ఎం జిల్లా అధ్యక్షకార్యదర్శులు ఎంజే వినోద్, గణేష్, చిదేడ్ సర్పంచ్ బైరీక రమాకాంత్ రెడ్డి, రంగాపూర్ సర్పంచ్ డబ్బికార్ మమత అజరుబాస్, జపా ల్ సర్పంచ్ సయ్యద్ నహిద్ రవుఫ్, ఎంపీటీసీ లట్టుపల్లి చంద్రశేకర్ రెడ్డి, సీపీఐ(ఎం)ఆరుట్ల గ్రామకమిటీ కన్వీనర్ పుల్లగళ్ళగోపాల్, మండల కమిటీ సభ్యులు మార బగ్గ రాములు, నూకం రవి, డాక్టర్ కొండిగారి బుచ్చయ్య, శాఖ కార్యదర్శులు నక్కమల్లేష్, సాతిరి సత్యం, చిందము కృష్ణ, పూజారి ప్రభాకర్, ఎస్కే.జావిద్ ఉన్నారు.