Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి
నవతెలంగాణ-ఆమనగల్
అనారోగ్యంతో బాధపడుతు ప్రయివేట్ ఆస్పత్రిలో చికి త్స పొందిన వారు సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్సీ కసి రెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన హైదరా బాద్‌లోని తన నివాసంలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెం దిన పలువురు లబ్దిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ వర్తించని అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ తమ వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భం గా తలకొండపల్లికి చెందిన నర్సిరెడ్డికి రూ.60వేలు, వెంక ట్రావుపేట్కు చెందిన సురేందర్‌కు రూ.24 వేలు, పల్గు తండాకు చెందిన రాంసింగ్‌కు రూ.28 వేలు, మౌనికకు రూ.40వేలు చెక్కులను ఎమ్మెల్సీ లబ్దిదారులకు అందజేశా రు. అదేవిధంగా ఆమనగల్ పట్టణంలో కేఎన్ఆర్ యువ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెకానిక్ బాబా అధ్వర్యంలో ఆమన గల్ పట్టణానికి చెందిన వి.శ్రీధర్‌కు రూ.22వేల చెక్కును లబ్దిదారునికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీ నర్ అవ్వారి శివలింగం, కేఎన్ఆర్ యువసేన జిల్లా నాయ కులు విజరు రాథోడ్, తెలంగాణ ఉద్యమ కారుడు పూసల పరమేష్, శ్రీను, మహబూబ్, మహేష్ పాల్గొన్నారు.