Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెరవేరునున్న గిరిజనుల చిరకాల కోరిక
- టీఆర్ఎస్ నియోజకవర్గ అధికార
- ప్రతినిధి టీటీ రాములు నాయక్,
- టీఆర్ఎస్ నాయకులు దేశా నాయక్, సర్పంచ్ శంకర్ నాయక్
నవతెలంగాణ-కొడంగల్
సీఎం కేసీఆర్‌కు గిరిజనులం ఎల్లవేళలా రుణపడి ఉం టామని టీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి టీటీ రాములు నాయక్, టీఆర్ఎస్ నాయకులు దేశా నాయక్, సర్పంచ్ శంకర్ నాయక్‌లు అన్నారు. ఈ సందర్భంగా కొ డంగల్లోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్‌కు పూల మా ల వేసిన నివాళులు అర్పించారు, అనంతరం సీఎం కెసి ఆర్, మంత్రి కేటీఆర్, గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథో డ్, విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనులకు 6 శాతం ఉన్న రిజర్వేషన్‌ను 10 శాతం వరకు పెంచుతామని హామీ ఇవ్వడం సీఎం కెసిఆర్‌కు గిరిజనులపట్ల ప్రేమ అర్థం అవు తుందన్నారు. హైదరాబాద్ నడిబొడ్డులో సేవాలాల్ బంజా రాభవన్, ఆదివాసి భవన్లను నిర్మాణం చేసి ప్రారంభిం చుకోవడం శుభపరిణామమన్నారు. భూములకు పట్టాలిచ్చి వాటికి రైతుబంధు వర్తించేలా చేస్తానని ప్రకటించడం గొ ప్ప విషయమన్నారు. ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుపై కేం ద్రంపై ఒత్తిడి తెస్తామనడం గిరిజనులపై సీఎం కేసీఆర్‌కు ఉన్న దర్శనీయతకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో మా జీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరోత్తం రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు నెహ్రూనాయక్, రాములునాయక్, ఉప సర్పం చ్ నార్యనాయక్ తదితరులు పాల్గొన్నారు.