Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ల సంఘం అధ్యక్షులు కె.రాజిరెడ్డి మండల రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ బోయిని లక్ష్మయ్య
నవతెలంగాణ-దోమ
రాష్ట్ర పరిపాలన సౌధంకు అంబేద్కర్ పేరుపెట్టడం మహానుభావునికి అరుదైన గౌరవం ఇచ్చిన్నట్టు అని దోమ మండలం సర్పంచ్ల సంఘం అధ్యక్షులు కె.రాజిరెడ్డి మండ ల రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ బోయిని లక్ష్మయ్య లు పేర్కొన్నారు. ఆదివారం దోమ మండలం ఎమ్మార్పీఎస్, స్థానిక అంబేద్కర్ యువజన సంఘల యువకుల ఆధ్వ ర్యంలో అంబేద్కర్ విగ్రహానికి సీఎం కేసీిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసారు. సీఎం కేసీఆర్ ఎస్సి, ఎస్టీల అభివృద్ధికి చేస్తున్న కృషి ఎనలేనిదని సర్పంచ్ కె రాజిరెడ్డి అన్నారు. యూత్ అధ్యక్షులు ఇక్కి సురేందర్ మాట్లాడుతూ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం సముచిత స్థానం ఇచ్చినట్టు అని సీఎం కేసీఆర్కు అట్టడుగు వర్గాలు రుణపడి ఉండాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ డప్పు శేఖర్, నాయకులు డప్పు రమేష్, కె.కృష్ణ, రాజు, నరేష్, అంజిలయ్య, శివ, ఎం.కృష్ణ.కె అంజి, టీఆర్ ఎస్ నాయకులు నరేందర్ రెడ్డి, నారాయణ, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.