Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మియాపూర్
మియపూర్ డివిజన్ పరిధిలోని ప్రగతి ఎనక్లేవ్లోని నీలిమ హైట్స్ అపార్ట్మెంట్ నందు అపోలో ఆస్పత్రి జూబ్లీ హిల్స్ వారి సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీ నర్ తాడిబోయిన రామస్వామియాదవ్ ఆధ్వర్యంలో ఉద యం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వర కూ వైద్యశిబిరం నిర్వహించారు. శిబిరంలో ఎత్తు, బరువు, బీపీ, షుగర్, పల్స్, కంటి, దంత, పరీక్షలు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ మారిన జీవనశైలిలో పర్యావరణంలో వస్తున్న అనేక మా ర్పుల వల్ల అనేక వ్యాధులకు గురవుతున్నారు. కొన్ని జాగ్ర త్తలు తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందన్నారు. కార్యక్రమంలో కాలనీ నాయకులు శ్రీనివా స్ యాదవ్, అమర్, రామచందర్ రావు, రాజు ముద్దసాని, కెవి రావు, రమేష్ అజరు రెడ్డి, మల్లారెడ్డి ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విష్ణు ప్రసాద్, ఉమా చంద్రశేఖర్, హాస్పిటల్ ప్రతినిధి అజిత్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.