Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్లో చేరిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు
- కండువా కప్పి ఆహ్వానించిన టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సి.రవీందర్ రెడ్డి
నవతెలంగాణ- యాలాల
తాండూర్ యువ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి వెంబడి తాము సైతం అంటూ మండలంలోని జక్కేపల్లి గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు ఆదివారం టీఆర్ఎస్ యువ నాయకుడు కె.గణేష్ అధ్వ ర్యంలో టీఆర్ఎస్లో చేరారు. టీిఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షులు రవీందర్ రెడ్డి సమక్షంలోవారికి గులాబీ కం డువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తాండూరు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల కార్యక్రమాలను చూసి ఇతర పార్టీల నుంచి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, చేరు తున్నారని అన్నారు. జక్కేపల్లి గ్రామం నుంచి నాగరాజు, రాజు, మల్కప్ప, శ్రీకాంత్, చిన్న, లాలు, సాయిలు వెంకటప్ప, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రమేష్, బెన్నూర్ సర్పంచ్ పటేల్ రెడ్డి, నాయకులు రఘురెడి, మాధవరెడి, కృష్ణ, లాలు, పాల్గొన్నారు.