Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కఠిన చర్యలు తప్పవు ఎస్ఐ రమేశ్‌కుమార్
నవతెలంగాణ-కొడంగల్
మద్యం తాగి వాహనాలు నడిపితే, కఠిన చర్యలు తప్పవని దౌల్తాబాద్ ఎస్ఐ రమేశ్ కుమార్ అన్నారు. సోమవారం మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వ్యక్తులకు ,తాగి వాహనాలు నడిపితే కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. మద్యం తాగి వాహనాలు నడిపి ఇతరుల మరణాలకు కారణం కావొద్దని కోరారు. ట్రాఫిక్ నిబంధనలు, పెండింగ్ చలాన్లు, హెల్మెట్ ధారణ, తదితర విషయాలపై అవగాహన కల్పించారు. పోలీసులు చేసే వాహన తనిఖీలు కేవలం ప్రజల ప్రాణరక్షణ కోసమేనని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మద్యం తాగి వాహనాలు నడపడం వల్లనే జరుగుతున్నాయని చెప్పారు. యువత మద్యం తాగి వాహనాలు నడపవద్దని, తల్లిదండ్రులు కన్న కలలు కల్లలు వృథా చేయవద్దని కోరారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.