Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
నవతెలంగాణ-శంకర్పల్లి
దళితబంధు పథకం దేశానికి ఆదర్శమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శంకరపల్లి మున్సిపల్ పరిధిలోని లబ్దిదారుడికి దళితబంధు పథకం ద్వారా మంజూరైన నిధులతో ఫొటో స్టూడియో ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల అభి వృద్ధికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి, అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్ర మంలో మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్,జడ్పీటీసీ గోవిందమ్మ గోపాల్ రెడ్డి,మున్సిపల్ వైస్ చెర్మెన్ బి వెంకటరాంరెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వెంకటరెడ్డి, కౌన్సిలర్లు రాములు, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షులు వాసుదేవ్ కన్నా శ్రీకాంత్ వెంకటేష్ తదితరులున్నారు.