Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-కొడంగల్
టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు, ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు టీఆర్ఎస్లోకి చేరుతున్న ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు.సోమవారం కొడంగల్ నియోజక వర్గంలోని అన్ని మండలాల నుంచి అంబేద్కర్, భారత నాస్తిక సమాజం, బహుజన సంఘాల నేతలు నాయకులు సభ్యులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రజాసేవ మానవ సంబంధాల పనితీరు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాసేవతో పాటు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా నాయకుడిగా నిరంతరం నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు చేర్చి ప్రజల మన్ననలు పొందాలని టీఆర్ఎస్ కార్యకర్తలకు,నాయకులకు తెలిపారు.టిఆర్ఎస్ పార్టీలో చేరినవారందరినీ అభినందించారు. పార్టీలో చేరిన వారిలో కోస్గి మండలం గౌరీ గల్లా మౌర్య కృష్ణ, సర్జకన్ పేట్ వార్డు సభ్యురాలు మమత, వెంకట్ రాములు, బొంరాస్ పేట్ మండలం డప్పు శ్రీను, కొడంగల్ మండలం వెంకటేశం, దౌల్తాబాద్ మండలం బెల్లం అంజి, దుద్యాల మండలం రాము, భారత నాస్తిక సమాజం నారాయణపేట జిల్లా అధ్యక్షులు చిన్ని కృష్ణ, నాస్తిక సమాజం డప్పు నరసింహ, పోలేపల్లి అంజి, నర్సాపూర్ నరేష్, సర్జకంపేట్ శాంతి, మల్లేష్, పండు, ఈశ్వర్, చౌదర్పల్లి నర్సింలు, ప్రమోద్, శ్రీనివాస్, రాజేష్, సుధాకర్, రాఘవేందర్‌తో పాటు మరో 50 మంది టీఆర్ఎస్లో చేరినట్టు తెలిపారు.వీరికి ఎమ్మెల్యే ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు.
నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పట్ల హర్షం
సీఎం కేసీఆర్ఆర్కు కృతజ్ఞతలు
నూతన సచివాలయ భవనానికి అంబేద్కర్ పేరును నామకరణం చేయడం హార్షనీయమన్నారు. అలాగే పార్లమెంటుకు కూడా అంబేద్కర్ పేరును పెట్టాలని ప్రతిపాదన పంపడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ప్రజాసంఘాలు, దళిత సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు.బహుజన వాది ఎరన్‌పల్లి శ్రీనివాస్, స్వేరో సర్కిల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుప్పలి అశోక్ కుమార్, స్వేరో సంఘాల మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.