Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ అన్ని కులవృత్తులకు పెద్దపీట
- విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
- రావిర్యాల పెద్ద చెరువులో వదిలిన చేప పిల్లలు
నవతెలంగాణ-మహేశ్వరం
సీఎం కేసీఆర్ అన్ని కులవృత్తులకు పెద్దపీట వేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తుక్కగూడ మండలంలోని రావిర్యాల పెద్ద చెరువులో చేపపిల్లలను వదిలారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయతో చెరువుల్లో పూడికతీత తీయటంతో అవి జలకళ సంతరించుకున్నాయని అన్నారు.గతంలో చేపల కోసం ఆంధ్ర పై ఆధారపడే వాళ్లమనీ, నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చేపల పంపిణీతో రాష్ట్రంలో పెరిగిన మత్య్స సంపద పెరిగిందన్నారు.రాష్ట్రంలో 88 కోట్ల చేప పిల్లలు పడనుండగా, రంగారెడ్డి జిల్లాలో కోటి 60 లక్షల చేప పిల్లలు నీటి వనరుల్లో వదిలే కార్య క్రమం చేపడుతున్నట్టు చెప్పారు. రావిర్యాల పెద్ద చెరువులో ఒక్క రోజే 5 లక్షల చేప పిల్లలు వదిలి నట్టు తెలిపారు. సొసైటీతరుపున మరో 15 లక్షలు చేప పిల్లలు వదిలి జీవనోపాధికి బాటలు వేయటం అభినందనీయమని తెలిపారు.చేపల మార్కెటింగ్‌కు ఔట్ లెట్లు, ద్విచక్ర వాహనాలు, ఫోర్ విల్లర్ వాహనాలు ప్రభుత్వం అందజేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 26,778 నీటి వనరులలో 68 కోట్ల రూపాయల వ్యయంతో 88.53 కోట్ల చేప పిల్లలను విడుదల చేసినట్టు పేర్కొన్నారు. రాష్ట్రం లోని చెరువులలో నీటి నిల్వలను పర్యవేక్షించేందుకు 26 వేలకు పైగా నీటి వనరులను జియోట్యాగింగ్ చేస్తున్నట్టు వెల్లడిం చారు. సొసైటీ ద్వారా 15 లక్షల చేప పిల్లలు వడలనుండటంతో సొసైటీకి సుమారు 30 లక్షల ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్ర మంలో రావిరాల గంగపుత్ర సంఘం అధ్యక్షులు గుంటి గణేష్, తుక్కుగూడ మున్సిపల్ వైస్ చైర్మెన్ భవాని వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు సప్పిడి లావణ్య రాజు, రెడ్డిగళ్ళ సుమన్, మహేశ్వరం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాట సురేష్, పీఏసీఎస్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు జి లక్ష్మయ్య, మహిళా అధ్యక్షురాలు పద్మభాస్కర్ రెడ్డి,యాత్ అధ్యక్షులు సామెల్ రాజు, ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ పంట మల్ల సురేష్, తెలంగాణ ఉద్యమకారుడు గోనమోని శివ శంకర్,మాజీ ఎంపీటీసీ లింగం సురేష్, నరసింహ, గంగాపురం నర్సింగ్ గౌడ్, టీఆర్ఎస్ యూత్ నాయకులు శివ రావిరాల గంగపుత్ర సంఘం నాయకుడు సభ్యులు పాల్గొన్నారు.