Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన సచివాలయానికి డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టడం హార్షనీయం
- గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు, త్వరలో గిరిజనబంధు అమలు చేయాలి
- టీఆర్ఎస్ మండల అధ్యక్ష,కార్యదర్శులు రమేశ్, కాట్రోత్ బహదూర్
నవతెలంగాణ-మంచాల
పేదల పక్షపాతి సీఎం కేసీఆర్ అన్ని టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు చీరాల రమేశ్, కాట్రోత్ బహదూర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదల అభివృద్ధికి అనేక సంక్షేమప పథకాలు ప్రవేశపెట్టి, అమలు చేస్తున్నారని తెలిపారు.అంతేకాకుండా దళితుల అభివృద్ధికి దళితబంధు ప్రవేశపెట్టి, అమలు చేస్తున్నట్టు తెలిపారు. జనాభా ప్రాతిపదికన గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించి, త్వరలోనే గిరిజనుల అభివృద్ధికి గిరిజనబంధు పథకం అమలు చేయడం మంచి పరిణామని తెలిపారు. నూతన సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం హర్షణీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టానలి సీఎం కేసీఆర్ కోరడం మంచి పరిణామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంబోతతండా సర్పంచ్ ఆంబోతు రఘునాయక్, టీఆర్ఎస్ నాయకులు ఎండీ జానీ పాషా, జాటోత లచ్చిరాం తదితరులు పాల్గొన్నారు.