Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుట్ల సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి
నవతెలంగాణ-మంచాల
ప్రజలు, పాలకవర్గం సహకారంతో విడతల వారిగా గ్రామాల అభి వృద్ధికి కృషి చేస్తామని సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని ఆరుట్ల గ్రామంలో వార్డులో రూ.2 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ ఆరుట్ల ఒకటోవ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులు లేకపో వడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బావించి గ్రామ పంచాయతీ నిధులతో రూ.2 లక్షలతో మంకు ఇందిరా ఇంటి నుంచి మంకు పోచమ్మ ఇంటి వరకూ సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. రానున్న రోజుల్లో గ్రామంలో అవసరమైన చోట సీసీరోడ్లు, అండర్ డ్రయినేజీ నిర్మాణ పనులు కోసం గ్రామస్తులు, పాలకవర్గం సహకారంతో గ్రామాభివృద్దికి కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చీరాల రమేశ్, ఉపసర్పంచ్ పాండాల జంగయ్య గౌడ్, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్, వార్డు సభ్యులు చిమర్ల గాలమ్మ, పంబల శివకుమార్, ఎన్నుదుల స్వప్న, కొండూరు మల్లేష్,ఎండీ సద్దాంహుసేన్, మమత ,మాజీ ఎంపీపీ మంకు ఇందిరా, మాజీ సర్పంచ్ అనంగాల్ల యాదయ్య, మాజీ మండల కో-ఆప్షన్ సభ్యులు ఎండీ సలాం,గుడ్డీ మల్ల చంద్రయ్య, వస్పరీ కుమార్, సుంకరి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.