Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక సహాయం అంద జేసిన కాంగ్రెస్ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి, జెడ్పీటీసీ భూపతిగళ్ళ మహిపాల్
నవతెలంగాణ-మంచాల
మండల పరిధిలోని కాఘజ్గట్లో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు వంగాలి నర్సింహ అనారోగ్యంతో మృతిచెందారు. స్థానిక నాయకులతో విషయం తెలుసుకున్న కాంగ్రెస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నాయకులు మర్రి నిరంజన్‌రెడ్డి రూ. 15 వేలు, ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీ భూపతి గళ్ళ మహిపాల్ రూ. 10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షులు వింజమూరి రాం రెడ్డి, కాగాజ్ గట్ ఉప సర్పంచ్ దాన్నే అయిలయ్య, కాంగ్రెస్ నాయకులు కందుకూరి జంగయ్య, ఎంఎన్ఆర్యువ సేన అధ్యక్షులు టేకుల కమలాకర్ రెడ్డి, నాయకులు కొండ్రు ప్రవీణ్, పెద్దగారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.