Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోడంగల్
కాంగ్రెస్ కోడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతి రెడ్డి సమక్షంలో కొడంగల్ మండలం చిట్లపల్లి, సంగాయి పల్లి, పోచమ్మ తాండ గ్రామాలకు చెందిన టిఆర్ఎస్ కార్యకర్తలు 100 మంది కాంగ్రెస్లో చేరారు. వారికి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం పని చేయాలని సూచించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ యువతను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ అభివృద్ధి పలాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షులు నందారం ప్రశాంత్, కౌన్సిలర్ శంకర్ నాయక్, సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.