Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్రహీంపట్నం ఎంపీపీ పంది కృపేష్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందజేయడం జరుగుతుందని ఇబ్రహీంపట్నం ఎంపీపీ పంది కృపేష్ అన్నారు. మండల పరిధిలోని వెల్మినేడులో ఆసరా పింఛన్ల కార్డులను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో 425 మందికి ఆసరా పింఛన్లు మంజూరయ్యాయన్నారు. వారందరికీ పింఛన్లు జారీ చేయడం జరుగుతుందని వివరించారు. ప్రభుత్వం పింఛన్ డబ్బులను పెంచడమే కాకుండా నూతన పింఛన్లు అందజేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ మంచిరెడ్డి ప్రతాపరెడ్డి, సర్పంచ్ అశోవర్ధన్ రెడ్డి, ఎంపీడీఓ జైరాం విజరు, జూనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ, ఉపసర్పంచ్ నౌసు మార్తా, కార్యదర్శి రావుల వెంకటేష్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు నర్సింహా, వార్డు మెంబర్స్ మహేష్ పాల్గొన్నారు.