Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వానికి పీఆర్టీయూటీ జిల్లా శాఖ వినతి
- రెండు ప్రతిపాదనలు వెంటనే ఉపసంహరించుకోవాలి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
దసరా సెలవులను కుదించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు వెంటనే ఉపసంహరించుకోవాలని పీఆర్టీయూటీ రంగారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు కేశవులు, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి మాట్లాడుతూ.. దసరా సెలవులు కదించడం అసంబద్ధ ఆలోచన అన్నారు. ప్రకతి వైపరీత్యం వల్ల ఏర్పడిన పరిస్థితికి కారణం వెతకాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితిపై స్పందించిన ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం మహాలయ అమావాస్య మరుసటి రోజు నుండి దసరా సెలవులు ప్రకటించడం సర్వసాధారణమన్నారు. గత ఎన్నో దశాబ్దాల నుండి ఇలాగే షార్ట్ టర్మ్ హాలిడేస్ ఇస్తారన్నారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభం అవుతాయని చెప్పారు. మొత్తానికి వారు ప్రతిపాదించింది ఏమాత్రం ఆమోదయోగ్యాంగా లేదని తెలిపారు. అకాడమిక్ క్యాలెండరులో ప్రకటించిన విధంగా సెలవులు యథాతథంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రెండవ శనివారం పని చేయాలని చెప్పడం అది ప్రాక్టీగల్ ఎలా సాధ్యమో వారే అలోచించాలన్నారు. ఆ ప్రతిపాదన కూడా విరమించుకోవాలని కోరారు.