Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చందానగర్
హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీకి చెందిన టీఆర్ఎస్ నాయకులు,ఉద్యమ కారుడు. రాము కుమార్ యాదవ్ గతేడాది రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం విధితమే. బాధిత కుటుంబసభ్యులకు టీఆర్ఎస్ నాయకులు వాసిలి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు లక్ష రూపాయాల చెక్కును అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా నిలిచిన వ్యక్తిని ఈ సందర్భంగా అభినందించారు. బాధిత కుటుబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు లక్ష్మారెడ్డి, మోహన్ ముదిరాజ్, గంగాధర్, మాధవరం గోపాల్, తిరుమలేష్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.