Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్
- విలేకరుల సమావేశంలో పలువురు నాయకులు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
బిల్లులు ఇవ్వకుండా ఎమ్మెల్యే ఇబ్బందికి గురి చేస్తున్నాడని పంచాయతీ రాజ్ ఆధీనంలోని జెడ్పీ గెస్ట్‌హౌస్ భవనం నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ దానయ్య చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఇబ్రహీంపట్నం ఎంపీపీ పంది కృపేష్, పార్టీ మండల అధ్యక్షులు బుగ్గరాములు, ఎంపీటీసీ భరత్‌కుమార్‌రెడ్డి, పార్టీ నాయకులు మంది సురేష్, నర్సింహ, కత్తుల కుమార్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జెడ్పీ గెస్ట్‌హౌస్ భవనాన్ని రూ.30లక్షల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ రూ.30లక్షల నిధులతో భవనం నిర్మించడం జరిగిందని తెలిపారు. కేవలం ఫ్లోరింగ్, కరెంటు, పెయింటింగ్ పనులు మిగిలి ఉన్నాయని, ఈ పనులు పూర్తి చేయాలని సదరు కాంట్రాక్టర్ దానయ్యని ఎమ్మెల్యే చెప్పారన్నారు. పనులు పూర్తి చేసిన దానయ్యకి పంచాయతీ రాజ్ ఇంజినీర్లు ఎస్టీమెషన్ ప్రకారం ఎమ్మెల్యే ప్రొసీడింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, కానీ కాంట్రాక్టర్ దానయ్య ప్రొపిడింగ్ తీసుకోకుండా 6 నెలలు కాలక్షేపం చేశారన్నారు. ఇపుడు వచ్చి రూ.50లక్షలు బిల్లులు పెండింగ్ ఉందంటూ తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జెడ్పీ భవనం పూర్తి నిర్మాణం ఖర్చు రూ.40 లక్షలకు మించదన్నారు. ఇప్పటి వరకు రూ.30 లక్షల నిధులు ఎంబీ రికార్డ్ చేసి కాంట్రాక్టర్ దానయ్య డ్రా చేసుకున్నాడన్నారు. మిగితా రూ.10 లక్షలు ఇవ్వడానికి ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారన్నారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఎవరినీ ఇబ్బంది పెట్టిన చరిత్ర లేదన్నారు. కొన్ని కోట్ల నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యేపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. పార్టీ నాయకులు మంఖాల దాస్ సైతం మరో ప్రకటనలో ఖండించారు.