Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
నవతెలంగాణ-మియాపూర్
'స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమంలో శేర్లింగంపల్లి ముందు వరుసలో ఉండాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరికె పూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం లో బుధవారం శేరిలింగంపల్లి జోనల్ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందికి చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జోనల్ కమిషనర్ శంకరయ్య, డీసీ వెంకన్న, కార్పొరేటర్లు హమీద్ పటేల్, గంగాధర్ రెడ్డి , మాజీ కార్పొరేటర్ శ్రీ సాయి బాబా తో కలిసి పారిశుధ్య సిబ్బందికి చెత్త బుట్టలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశుధ్య సిబ్బంది తల్లిదండ్రులతో సమానం అని, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో వారి సేవలు మన పరిసర ప్రాంతాలను, కాలనీలను అద్దం లా గా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతున్నారని తెలిపా రు. వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కెఎంహెచ్ఓ నగేష్ నాయక్, కార్తిక్, శానిటేషన్ సూపర్వై జర్ జలందర్, మహేష్, కంకరాజు, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్ర గుడ్ల శ్రీనివాస్‌యాదవ్, టీఆర్ఎస్ నాయకులు జనార్దన్ రెడ్డి, రఘునాథ్, శ్రీకాంత్, సల్లావుద్దీన్, అక్బర్ బాయి, దీపక్, పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.