Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహేశ్వరం గురుకుల పాఠశాలను సందర్శించిన గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రాస్
నవతెలంగాణ ఎఫెక్ట్స్
నవతెలంగాణ-షాబాద్
షాబాద్లో ఉన్న గురుకుల పాఠశాలను దసరా తరువాత మహేశ్వ రం నియోజకవర్గానికి మార్చుతామని గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రాస్ అన్నారు. షాబాద్ నుండి మహేశ్వరానికి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను మార్చాలని మంగళవారం నవతెలంగాణ దినపత్రిక లో వార్త ప్రచురితం అయింది. దీంతో బుధవారం సాంఘీక సంక్షేమ మహేశ్వరం గురుకుల పాఠశాలను గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రాస్ సందర్శించారు. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. పాఠశాలలో భవనంలోని తాగునీటి వసతి, కిచెన్, మరుగుదొడ్లు, పరిస రాలను పరిశీలించారు. పాఠశాలలో రెండు రోజులుగా నీరులేక విద్యార్థు లు స్నానాలు కూడా చేయలేని పిరిస్థితి ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. మహేశ్వరం ఉండాల్సిన గురుకుల పాఠశాలను షాబాద్లో నిర్వహించడంతో తమకు, తమ పిల్లలకు చాలా ఇబ్బందిగా మారిందని తెలిపారు. దీంతో పాఠశాలను మహేశ్వరం నియో జకవర్గానికి గురుకులా పాఠశాలను మార్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన విద్యార్థి తల్లిదండ్రులకు తెలిపారు. జిల్లా కలెక్టర్ అమోరు కుమార్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దసరా సెలవుల తరువాత పాఠశాలను మహేశ్వరం నియోజకవర్గానికి మార్చుతామని వి ద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఆయన వెంట ఓఎస్డీ చంద్రకాంత్, ఆర్సీవ్ నాగకళ్యాణి, జెఎస్ శారత, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మీ, ఉపాధ్యాయులు ఉన్నారు.