Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 53 రోజులైనా ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన
నవతెలంగాణ-షాబాద్
భూ పరిహారం ఇవ్వకుంటే తమ భూములు తమకు అప్పగించాలని చందనవెళ్లి భూనిర్వాసితులు భూ పరిహారం కోసం హైతాబాద్ టవర్ ఎ క్కి ఆందోళన చేశారు. షాబాద్ సీఐ గురువయ్యగౌడ్, డిప్యూటీ తహసీల్దార్ క్రాంతికుమార్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. టవర్ఎక్కిన భూనిర్వాసితులతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ చేవెళ్ల ఆర్డీవో వచ్చి తమతో మాట్లాడేంత వరకూ దిగమని తెల్చిచెప్పారు. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని సీఐ హామీ ఇవ్వడంతో టవర్ దిగి ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడు తూ... తమ తాతల కాలం నుండి భూమిని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. తమ భూములు తీసుకొని పరిహారం చెల్లిం చకుండా రోడ్డు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమార్కులకు నష్టపరిహారం చెల్లించి, అర్హులైన రైతులను నట్టేట ముంచారన్నారు. తమ కు పరిహారం అందే వరకూ ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు.
.