Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ పథకాలు ప్రతి గడపకూ చేరాలి
- ఎంపీపీ వై.రవీందర్ యాదవ్
నవతెలంగాణ-కేశంపేట
పార్టీలకు అతీతంగా మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీపీ వై.రవీందర్‌యాదవ్ అన్నారు. బుధవారం కేశంపేట సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు తమ గ్రామాలలో నెల కొన్న పలు సమస్యలను సభ దృష్టికి తీసు కువచ్చారు. పాపిరెడ్డిగూడ, తూర్పు ఇపగడ్డ తండా, ఇప్పలపల్లి, కాకునూరు, బొదునంపల్లి తదితర గ్రామాలలో విద్యుత్ సమస్య ఉందని ఆయా గ్రామాల సర్పంచులు విష్ణువర్ధన్ రెడ్డి, శశికళ, ఆంజనేయులు, లక్ష్మమ్మ, కలమ్మలు సభ దృష్టికి తీసుకువచ్చారు. పౌల్ట్రీ ఫామ్ లలో చెందిన కోళ్లను యజమానులు ఎక్క డపడితే అక్కడ విసిరివేయడంతో వాటిని తిని రుచి మరిగిన కుక్కలు గొర్రెలను, మేక లను, లేగ దూడలను వెంటాడి చంపుతు న్నాయని పలు గ్రామాల సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. ఓటరు లిస్టులో తన పేరును తొలగించడం పట్ల ఇది ఎవరి తప్పిదమని బైరాన్‌పల్లి సర్పంచ్ కృష్ణయ్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తమ గ్రామాల్లో విద్యుత్, మిషన్ భగీరథ నీటి సరఫరా సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో సభ్యులు వ్యక్తపరచిన సమ స్యలపై ఎంపీపీ స్పందిస్తూ సభలో ప్రజా ప్రతినిధులు లెవనెత్తే సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని, పరిష్కారం కానీ యేడలా ఎందుకు కాలేదో ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలన్నారు. దాని వలన అధి కారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమాచార లోపం తలెత్తదన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతిఒక్కరికీి అందేలా చూడాలన్నా రు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తాండ్ర విశాలశ్రవణ్కుమార్రెడ్డి, సింగిల్ విండో ఛైర్మ న్ జగదీశ్వర్‌గౌడ్, వైస్ ఎంపీపీ అనురాధ పర్వత్‌రెడ్డి, తహసీల్దార్ అజం అలీ, ఇన్చార్జి ఎంపీడీఓ రవిచంద్ర కుమార్‌రెడ్డి, ఎంపీఓ శ్రీనివాస్, కో-ఆప్షన్ సభ్యులు జమాల్‌ఖాన్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఆ యా శాఖల అధికారులు పాల్గొన్నారు.