Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
నవతెలంగాణ-మియాపూర్
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాల నీ, గోపన్‌పల్లి ఎన్టీఆర్నగర్, నానక్ రాంగుడా, రాయ దుర్గం కాలనీలలో చేపట్టబోయే థీమ్ పార్క్‌లు, సీసీరోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి, ఉప్పల పాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ సాయి బాబాతో కలిసి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ శేరిలింగంపల్లి నియోకజకర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానని గాంధీ పేర్కొన్నారు. గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ సీసీరోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం సంతోషకరమని మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామన్నారు. సీసీరోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యతా విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రజలకు ట్రాఫిక్ రహిత, సుఖవంతమైన, మెరుగైన రవాణా సౌకర్యానికి శాయ శక్తుల కృషి చేస్తానన్నారు. కార్యక్ర మంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు రాజు నాయక్ టీఆర్ఎస్ నాయకులు చెన్నం రాజు, మంత్రి ప్రగడ సత్యనారాయణ, శ్రీను పటేల్, దారుగుపల్లి నరేష్, జంగయ్య యాదవ్, సురేందర్, సతీష్, సంపత్, మల్లేష్, వినోద్, యాదగిరి, వసంత కుమార్, రమేష్, రాజు ముదిరాజు, సల్లావుద్దీన్, అక్బర్, సురేష్ నాయక్, నర్సింహ రాజు, రామేశ్వరమ్మ, అంజమ్మ, బాల మణి, ఇందిరా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.