Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్కు నివేదిక అందజేయనున్న ఇండియన్ సర్వీసెస్ అధికారుల బృందం
నవతెలంగాణ-కొత్తూరు
ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఇండియన్ సర్వీసెస్ అధికారుల బృందం మండలంలోని పెం జర్ల గ్రామంలో చేపట్టిన అధ్యయనం శనివారంతో ముగిసింది. ఐదు రోజులుగా బృంద సభ్యులు స్వప్నిత్, సునీల్, శాశ్వత్, ప్రేమ్ సుఖ్ అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన విద్య, ఆరోగ్య, రక్షణ, వ్యవసాయం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రోడ్లు, సంక్షేమ పథకాలైన ఆసరా, రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఎన్ఆర్ఈజీఎస్, కెసిఆర్ కిట్టు వాటి అమలు తీరు వాటి ప్రయోజనాలు పాలన విధా నాలపై క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి నివేదిక రూపొందిం చారు. తయారుచేసిన పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్ అమోరు కుమార్కు అందజేయనున్నట్లు అధికారుల బృం దం తెలిపారు. ఈ సందర్భంగా బృంద సభ్యులను ఎంపీడీవో శరత్ చంద్రబాబు మండల పరిషత్ కార్యా లయంలో ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో ఎంపీఓ నర్సింలు, సూపరిండెంట్ వేణుగోపాల్, పెంజర్ల పంచాయతీ కార్యదర్శి సురేందర్, ఆఫీస్ సిబ్బంది శ్రీనివాస్, లక్ష్మి, కెజియ తదితరులు పాల్గొన్నారు.