Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లారెడ్డి
నవతెలంగాణ-శంకర్పల్లి
తెలంగాణ ఉద్యమంలో టీఎస్ యూటీఎఫ్ కీలక పాత్ర పోషించిందని మహబూబ్‌నగర్, రంగారెడ్డి , హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి తెలంగాణ ఐక్య ఉపా ధ్యాయ ఫెడరేషన్(టీ యూటీఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షులు దేవన్నగారి మల్లారెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా, శంకర్పల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్తపల్లిలో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య వాద సంఘమైన ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నుంచి విడిపోయి తెలంగాణ సాధనకు తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీ యూటీఎఫ్) స్థాపించి స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా శక్తి వంచన లేకుండా కృషి చేసిందన్నారు. ఆనాటి పాలకులు ఎన్ని కుతంత్రాలు, నిర్బందాలకు పాల్పడిన లొంగకుండా తెలంగాణ ఉద్యమం చేసినట్టు పేర్కొన్నారు. టి.యు.టి.ఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమ సదస్సులు నిర్వహించి ఉపాధ్యాయులను, ప్రజలను ఉద్యమం వైపు తిప్పేందుకు అవగాహన కల్పించినట్టు తెలిపారు. తనను ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపిస్తే దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న సర్వీస్ రూల్స్‌కు శాశ్వత పరిష్కారం,సీపీఎస్ రద్దు, పదోన్నతులు తదితర సమస్యలు పరిష్కరించేందుకు ఉపాధ్యాయులందరూ హదయాలలో సంతోషాన్ని నింపే బాధ్యత వహిస్తానని దేవన్నగారి మల్లారెడ్డి పేర్కొన్నారు.పాఠశాలలకు మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రఘునందన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ప్రధానకార్యదర్శి ఎండీ. మునీర్ పాషా, జిల్లా కార్యదర్శి మొగులయ్య నాయకులు దయానందం, శివానందం వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.