Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులకు పెంచిన జీతాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటు
- మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం స్పందించాలి
- జాతీయ బీసీ సంఘం సభ్యులు
- రాజ్ కుమార్ కందుకూరి డిమాండ్
నవతెలంగాణ-తాండూరు
మున్సిపల్ కార్మికులకు పీఆర్పీని అమలు చేయాలని జాతీయ బీసీ సంఘం సభ్యులు, తాండూరు నియోజక వ ర్గం కన్వీనర్ రాజకుమార్ అన్నారు. తాండూరు పట్టణ కేం ద్రంలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న ధర్నాకు బీసీ సం ఘం ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. తాండూరు మున్సి పల్ పరిధిలో మున్సిపల్ కార్మికులు విధులను బహిష్క రించి 6 రోజులుగా సమస్యలను పరిష్కరించాలని దీక్ష, ధర్నాలు చేస్తున్న ప్రభుత్వం అధికారులు పట్టించుకోక పోవ డం దారుణం అన్నారు. మున్సిపల్ కార్మికుల దీక్షకు తమ మద్దతు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంఘం సభ్యులు తాండూర్ నియోజవర్గ కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి రాష్ట్ర బీసీ కార్యదర్శి సయ్యద్ సుకుర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్ చారి తాండూర్ నియోజవర్గ మహిళా అధ్యక్షురాలు నాయి కోడి జ్యోతి తాండూర్ మండల బీసీ యువజన సంఘం అధ్య క్షుడు బసంత్ కుమార్ సోషల్ మీడియా ఇన్చార్జీ బస్సు యువనాయకులు రాము ముదిరాజ్ జుంటుపల్లి వెంకట్ మహిళా నాయకురాలు విజయలక్ష్మి మతమతిన్ మాధవ్ కార్మికులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సంద ర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ..6 రోజుల నుండి మున్సిపల్ కార్మికులు విధులను బహిష్కరించి రోడ్డుపై వచ్చి దీక్ష చేస్తుండడం విచారకరమన్నారు. తెలంగాణ రాష్ట్రమంతా కొత్త పీఆర్సీ అమలవుతుంటే తాండూర్ పట్టణంలో మాత్రం కొత్త పీిఆర్సీ అమలు కోసం రోడ్డుపైన వచ్చి దీక్ష చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. వెంటనే కొత్త పీఆర్సీ తాండూర్ కార్మికులకు వచ్చే విధంగా పాలకులు కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో బీసీ సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తా మని హెచ్చరించారు. రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ సుకుర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్ చారి మాట్లాడుతూ..కార్మికులకు పూర్తి మద్దతు ఉంటుందని వెంటనే కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిం చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.