Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోయంబత్తూరు వెళ్లి స్వగ్రామానికి తీసుకువచ్చిన వైనం
- సీఎం సహాయ నిధి ఎల్వోసీ ఇప్పిస్తానని హామీ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
దైవకార్యాన్ని నమ్ముకొని శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వాములు కోయంబత్తూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన బాధితులను దండుమై లారం సర్పంచ్ రమణమోని మల్లీశ్వరి జంగయ్య చేయూతనందించారు. అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రానికి తీసుకువచ్చి వైద్యం అందించే ఏర్పాటు చేశారు. దండుమైలారం గ్రామానికి చెందిన గురుస్వామి దానయ్య పాదయాత్రగా శబరిమలై వెళ్తున్నారు. కాగా కోయంబత్తురు వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తీవ్ర గాయాల పాలైన దానయ్యను తోటి అయ్యప్ప మాలదారులు అక్కడి ఆస్పత్రిలో చేర్పించారు. విషయాన్ని వెంటనే స్వగ్రామంలోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే కోయంబత్తూరు వెళ్లి దాన య్యను చూసే ఆర్థిక స్తోమత ఆ కుటుంబ సభ్యులకు లేకపోవడంతో గ్రామ సర్పంచ్ రమణమోని మల్లీశ్వరి జంగయ్య స్పందించారు. వెంటనే తన సొంత ఖర్చులతో కుటుంబ సభ్యులను కోయంబత్తూరు తీసుకువెళ్లారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దానయ్యను పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిపై అక్కడి వైద్య సిబ్బందితో మాట్లాడి కోయంబత్తురు నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చారు. అతన్ని నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సీఎం సహాయ నిధి డబ్బులు అందించేందుకు స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో మాట్లాడి ఎల్ఓసీ ఇప్పించనున్నట్టు సర్పంచ్ హామీ ఇచ్చారు.