Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ నాయకులు జగన్, జంగయ్య
- కొనసాగుతున్న నిరసన దీక్ష
నవతెలంగాణ-యాచారం
ప్రజల ప్రాణాలకు హాని కలిగించే బొక్కల కంపెనీని వెంటనే బంధు చేయాలని డీవైఎఫ్ఐ నాయకులు జగన్, ఆలంపల్లి జంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం యాచారం మండల పరిధిలోని కొత్తపల్లిలో ఉన్న కిసాన్ ఆగ్రో ఫీడ్స్ కంపెనీకి వ్యతిరేకంగా గ్రామ ప్రజలు చేస్తున్న నిరసన దీక్ష బుధవారం ఏడోవ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు అఖిలభారత ప్రజాతంత్ర జన సంఘం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుళ్లిపోయిన మాంసంతో వంట నూనె, కొవ్వు పదార్థాలను తయారుచేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని తెలిపారు. దీంతో ఇక్కడ వ్యవసాయం చేసే రైతులు, కూలీలు, స్థానిక ప్రజలు వాసనతో ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఈ కంపెనీని నడిపిస్తున్నారని విమర్శించారు. ఏదేమైనా నాలుగు గ్రామాల ప్రజలందరూ ఐక్యంతో పోరాటం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మొక్కల కంపెనీని ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చిక్కుడు గుండాలు, ఉప సర్పంచ్ కావలి జగన్, వార్డు సభ్యులు శ్రీనివాస్, ఐలయ్య, విప్లవ కుమార్, జంగయ్య, శివ, సత్యనారాయణ, కృష్ణ, యాదయ్య, మహేష్ పాల్గొన్నారు.