Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢవైీఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పి. జగన్
- ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిపై బడ్జెట్ పత్రాలు దగ్ధం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
విద్యారంగానికి 6.57 శాతం నిధులు కేటాయించడం సిగ్గుచేటని ఢవైీఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి.జగన్ అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఇబ్రహీంపట్నం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బడ్జెట్లో నిరసిస్తూ పట్నం అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం సాగర్ రహదారిపై బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా డీివైఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి జగన్ మాట్లాడుతూ... బడ్జెట్లో నిరుద్యోగ భతి లేదని, అలాగే ఉన్నత విద్యకు కేటాయించిన 3001 కోట్ల రూపాయలు ఏమాత్రం సరిపోదన్నారు. అలాగే కొఠారి కమిషన్ సిఫారసు చేసిన విధంగా 30 శాతం నిధులు ఇప్పటికైనా అసెంబ్లీలో ప్రతిపాధించి ఈ బడ్జెటును తీసుకురావాలన్నారు. అనంతరం ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మస్క చరణ్ మాట్లాడుతూ.. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయీంబర్స్ మెంట్ స్కాలర్షిప్ దాదాపు 4300 కోట్ల రూపాయలు ఉన్నాయని అన్నారు. కానీ 2023-24 బడ్జెట్లో ఉన్నత విద్యకు కేవలం 3000 కోట్లు కేటాయించడం చాలా బాధకరమన్నారు. బకాయిలు రూ.4300 కోట్లు ఉన్నప్పుడు రూ. 3000 కోట్లు ఎలా సరిపోతాయని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేవలం రంగారెడ్డి జిల్లాలోని బీసీ సామాజిక వర్గానికి రూ.130 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని, ఈ విధంగా చూస్తే రాష్ట్రంలో మొత్తం 4300 కోట్ల బకాయిలను కేవలం 3000 కోట్లతో ఏలా సరి పెడతారని అన్నారు. ఇప్పటికైనా విద్యారంగానికి 30 శాతం నిధులు ప్రతిపాదించాలన్నారు. లేనిపక్షంలో ఈ అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు తరంగ్, ఎస్ఎఫ్ఐ నాయకులు లక్ష్మణ్, మధు, వర్షిత్, తదితరులు పాల్గొన్నారు.