Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపాలిటీ నూతన భవన ప్రారంభోత్సవంలో
ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
నవతెలంగాణ-షాద్నగర్
ప్రజల సహకారంతో మరింత అభివృద్ధి చేసి చూపి స్తామని, షాద్నగర్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. షాద్నగర్ మున్సిపాలిటీ నూతన భవనాన్ని బుధవారం ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రారంభించారు.మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్ ఆధ్వర్యంలో నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ముందు చూపు తో అభివృద్ధి చేపడుతుందని, అందులో భాగంగా నియో జకవర్గంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా ఎన్నో ప్రగతి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే వివరించారు. రూ. 5.90 కోట్ల నిధులతో నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని అన్ని వసతులతో అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిం చినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రజలు సహకరిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రభు త్వం ఒక విజన్ ద్వారా ముందుకు సాగుతుందని వివ రించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఒక విజన్ ద్వారా పట్టణాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల అవసరా లను తీర్చే మార్కెట్ కూడా త్వరలోనే ఉపయోగంలోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పి శం కర్ రావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈటా గణేష్, జెడ్పి టిసి వెంకటరామిరెడ్డి, కమిషనర్ వెంకన్న, ఎంపీడీవో విన రు కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు నారాయ ణరెడ్డి, రామకృష్ణారెడ్డి, కౌన్సిలర్లు సర్వర్ పాషా, వెంక టాంరెడ్డి, గౌస్, ప్రతాప్ రెడ్డి, కృష్ణవేణి, శ్రీనివాస్ గౌడ్, కో ఆప్షన్ సభ్యులు ఒగ్గు కిషోర్, మహ్మద్ ఏజాజ్, చెట్ల నర్సిం హులు, జాంగారి రవి, కిశోర్, జూపల్లి శంకర్ పాల్గొన్నారు.