Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాలు లేక ఆరుబయట కూర్చొని వీడియో కాన్ఫిరెన్స్ వింటున్న పంచాయతీ, ఆయా శాఖ అధికారులు
నవతెలంగాణ-దోమ
జిల్లా అధికారులు బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్స్కు ఆయా శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. కానీ దోమ తాహసీల్దార్ కార్యాలయంలో వీడియో కాన్ఫిరెన్స్కు ఏర్పాటు చేసిన హాలు సర్దుబాటు కాకపోవడంతో ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతి నిధు లు అరుబయటే కూర్చొని వీడియో కాన్ఫిరెన్స్ వింటున్నా రు. ప్రభుత్వం అధికారులకు మండల కేంద్రంలో భవనాలు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోకపోవడంతో అధికా రుల తిరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వీడియో కాన్ఫిరెన్స్పై మండల స్థాయి అధికారులు చొరవ చూపకపోవడంతోనే ఈ దుస్థుతి నెలకొంటుందని ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి అధికారులకు సరైన వీడి యో కాన్ఫిరెన్స్ హాలు ఏర్పాటు చేయించేలా కృషి చేయా లని కోరుతున్నారు.