Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ మంత్రి సుద్దాల దేవయ్య
- అధికార పార్టీ అండతో ఒకపక్క మైనింగ్, మరోపక్క ఫార్మా
- బీజేపీ మండల విస్తృతస్థాయి సమావేశం
నవతెలంగాణ-యాచారం
స్థానిక ఎమ్మెల్యే అసమర్థతతోనే యాచారం మండ లంలో విషం చిమ్మే కంపెనీలు చలామణి అవుతున్నాయని బీజేపీ మాజీ మంత్రి సుద్దాల దేవయ్య ఆరోపించారు. బుధవారం యాచారం మండలం పరిధిలోని చౌదర్పల్లి గేటు దగ్గర రాధాకష్ణ ఫంక్షన్ హాల్లో బీజేపీ మండల అధ్యక్షుడు తాండ్ర రవీందర్ ఆధ్వర్యంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ అండతో ఓ పక్క మైనింగ్, మరో పక్క విషం జిమ్మే ఫార్మా కంపెనీలు వస్తున్నాయని విమర్శించారు. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఈ కంపెనీలను పూర్తిస్థాయిలో నిషేధిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పోరెడ్డి నరసిం హారెడ్డి, మరిపల్లి అంజయ్య యాదవ్, పో రెడ్డి అర్జున్ రెడ్డి, ఎంపీపీ కొప్పు సుకన్య భాష, సర్పంచ్ డేరం గుల రాజు, నల్లవెల్లి రాజు, నడికుడి కృష్ణ, పురుషోత్తం, గోగి కార్ రమేష్, గొల్లపల్లి జంగయ్యగౌడ్, కొండ మధుకర్ రెడ్డి, జగదీష్, విజరు కుమార్, శాంతి కుమార్, గడ్డం దయాకర్, కొండాపురం నాగరాజు, శివ మోడీ, పాల్గొన్నారు.