Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్కు ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసీ వినతి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఎన్ఆర్ఈజీఎస్ కాంట్రాక్టు ఉద్యోగులకు టైం స్కేల్ వర్తింపజేయాలని ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసీ అధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.. కాంట్రాక్టు ఉద్యోగులకు టైంస్కేల్ వర్తింపజేస్తూ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల వేదికగా ముఖ్యమంత్రి ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. గత సెప్టెంబర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తామని సీఎం ప్రకటించార ని గుర్తు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ, సెర్ఫ్ ఉద్యోగులకు పే స్కేల్ ఏప్రిల్ నుండి అమలులోకి వస్తుందని ప్రకటన చేశారని చెప్పారు. కానీ ఈ ప్రకటనలో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖలో పని చేస్తున్న ఒక విభాగమైన సెర్ఫ్ కాంట్రాక్టు ఉద్యోగులకు క్రమబద్ధీకరణ చేసి, పే స్కేల్ ప్రకటించాలని, అదే శాఖలో పని చేయుచున్న రెండో విభాగమైన ఎన్ఆర్ఈజీఎస్ కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ ప్రకటనలో స్థానం కల్పించాలని కోరారు. 2006లో ఉపాధి హామీ నిర్వహణకు ప్రతి జిల్లా జిల్లా సెలెక్షన్ కమిటి వివిధ హౌదాల్లో ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా కాంట్రాక్టు పద్ధ్దతిలో నియామకం చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 3,874 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పని చేస్తున్నారని చెప్పారు. వీరికి పే స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ జెఏసీ ఛైర్మెన్ నాగభూషణం, తిరుపతాచారి, ఆదిత్య, శ్వేత, బాలు, కష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.