Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
- కొనసాగుతున్న హాత్ సే హాత్ జోడో యాత్ర
నవతెలంగాణ-బంట్వారం
బంట్వారం మండల పరిధిలోని మద్వాపూర్ గ్రామం లో గురువారం హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని మా జీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ నిర్వహించారు. రాహు ల్ గాంధీ భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో ఈ కార్యక్రమం ప్రారంభించామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్‌గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4,000 కిలో మీటర్లు పాదయాత్ర పూర్తి చేసి ప్రజల కష్ట సుఖాలను పంచుకున్నడని తెలిపారు. గడప గడపకూ రాహుల్ గాంధీ సందేశాన్ని తెలియపర్చలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కులలు, మతాలు అంటూ మనుషుల మధ్య చిచ్చు పెడుతూ వారి ఓట్లు ద్వారా గెలుస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని అన్నారు. వరంగల్ డిక్లరషన్తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగిస్తామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు ఏకకాలంలోనే రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. ధరణిని రద్దు చేస్తామని చెప్పారు. ఈ కార్యమంలో కాంగ్రెస్ మం డల అధ్యక్షులు పోచారం వెంకటేశం, జడ్పీటీసీ సంతోష, కాంగ్రెస్ సోషల్ మీడియా స్టేట్ కో-ఆర్డినేటర్ రఘుపతి రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు రత్నారెడ్డి, బ్లాక్ వన్ అధ్యక్షులు అనంతిరెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు నర్సింలు, కో-ఆప్షన్ మెంబర్ తౌపిక్ పాషా, మండల సీనియర్ నాయకులు వీరేశం, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గన్నారు.