Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డు పరిశీలించిన ఆర్టీసీ అధికారులు
- బండలేమూర్ నుంచి నారాయణపూర్ వరకు రోడ్డు పరిశీలన
- సీపీఐ(ఎం) బృందం వినతికి అధికారుల స్పందన
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు, ఇబ్రహీంపట్నం నుంచి బండలేమూర్ మీదుగా నారాయణపూర్ వరకు ఆర్టీసీ బస్సు ట్రిప్పులు నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు గురువారం సర్వే నిర్వహించారు. సాధ్యసాధ్యాలను పరిశీలించారు. ఈ నెల 7న ఈ మార్గాల్లో బస్సు ట్రిప్పులు నడిపించాలని కోరుతూ సీపీఐ(ఎం) బృందం ఆధ్వర్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అందుకు స్పందించిన ఆయన ఆర్టీసీ ఈడీకి బస్సు ట్రిప్పులను నడిపించే విషయమై రూట్ సర్వే చేయాలని ఆదేశించారు. దాంతో ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో ఎస్టీఐ సౌజన్య ఆధ్వర్యంలో అధికారులు రోడ్డు పరిశీలించారు. ముందుగా ఇబ్రహీంపట్నం నుంచి మంగల్‌పల్లి, కొంగరకలాన్ మీదుగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు, కలెక్టరేట్ నుంచి బొంగ్లూర్ ఔటర్ రింగురోడ్డు మీదుగా బస్సు నడిపించేం దుకు సర్వే చేశారు. అదే విధంగా ఇబ్రహీంపట్నం నుంచి మంచాల, ఆరుట్ల, చెన్నారెడ్డిగూడ, బండాలేమూర్ మీదుగా నారాయణపూర్ వరకు బస్సులో వెళ్లి రోడ్డును పరిశీలించా రు. వర్షాల కారణంగా బండలేమూర్ నుంచి పొర్లగడ్డ గడ్డతండా వరకు ఉన్న రోడ్డు వర్షాల కారణంగా చిధ్రమైంది. సుమారు రెండున్నర ఏండ్లుగా ఈ మార్గంలో నడిచే బస్సు రద్దయింది. దాంతో ఈ మార్గంలో ఉన్న పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో రోడ్డుకు సుమారు రూ.24లక్షల వ్యయంతో నిధులతో రోడ్డు బాగు చేశారు. రద్దయిన బస్సులు నడిపించాలని కోరుతూ సీపీ(ఎం) ఆధ్వర్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను కలిసి విన్నవించారు. అందులో భాగంగానే ఇబ్రహీంపట్నం ఆర్టీసీ అధికారులు ఈ మార్గంలో రోడ్డును పరిశీలిం చారు. ఆర్టీసీ బస్సు నడిచేందుకు అనువుగా ఉండడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. బస్సులు త్వరలోనే పునరుద్ధరించేందుకు అధికారులు సిద్దం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారుల పరిశీలన సందర్భంగా గ్రామస్తులు కలిసి నారాయణపురం వరకు రోడ్డు మార్గాన్ని సైతం పరిశీలన చేసి ఆయా తండాల్లో గిరిజనులతో మాట్లాడారు. ఆర్టీసీ బస్సులు మళ్లీ ఈ మా ర్గంలో నడిపించేందుకు కృషి జరుగుతుండటంతో గిరిజన ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి-యాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దు గ్రామాల ప్రజలకు రవాణా వ్యవస్థ అందుబాటులోకి రానున్నదంతో ఆర్టీసీ అధికారు లకు, ఆగిపోయిన బస్సును పునరుద్ధరించడం కోసం నిర్వీరామంగా కృషి సీపీఐ(ఎం) నాయకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పోచమోని కృష్ణ, మాజీ ఎంపీటీసీ వట్టి వెంకటేశ్, సీపీఐ(ఎం) గ్రామ కార్యదర్శి జోగు శ్రీనివాస్, నాయకులు జోగు జగదీశ్వర్, మలం జంగయ్య, జోగు దర్శన్, జర్పుల కిషన్, కరంటోత్ శంకర్, బద్దుల రమేష్, వలపు రంగయ్య, జారుపుల రవి, కొంకానీ అరవింద్, కెళ్లోత్ తండ గిరిజన నాయకుడు దుద్యానాయక్, తదితరులు పాల్గొన్నారు.