Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపాలిటీల్లో వంద శాతం పూర్తి చేయాలి
- మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
మున్సిపాలిటీల్లో ఇంటి పన్ను వంద శాతం వసూలు చేసేలా, సమస్యలు పరిష్కరించేలా కమిషనర్లు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హరీష్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో పలు అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ మున్సిపాలిటీలకు ఉన్న లక్ష్యాలను ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని అన్నారు. మున్సిపల్ కార్యలయాలలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగు లకు పీఎఫ్, ఈఎస్ఐ వర్తించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇంటి పన్ను లక్ష్యాలను స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పూర్తి చేయాలని, షాపులకు మంజూరీ చేసే ట్రేడ్ లైసెన్స్ డాటా మొత్తం ఆన్లైన్లోనే నిర్వహించాలని తెలిపారు. సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కమిషనర్లకు సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో అన్ని రకాల పన్ను వసూలు డిజిటల్ రూపంలో వసూలు చేయాలని సూచించారు. మార్చి 31లోపు అన్ని మున్సిపాలిటీల్లో ప న్నులు వసూలు చేసేలా కమిషనర్లు ప్రత్యేక దృష్టి సారిం చాలన్నారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అదికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.