Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎస్పీ సత్యనారాయణ
నవతెలంగాణ-ధరూర్
ప్రశాంతవంతమైన వాతావరణంలో ప్రజలు జీవిం చాలని, చిన్న, చిన్న విషయాలపై గొడవలు పడకూడ దని, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలనీ వికారాబాద్ డీఎస్పీ సత్యనారాయణ సూచించారు. ధారూర్ మండల పరిధిలోని నాగసముందర్ గ్రామంలో ధారూర్ సీఐ అప్పయ్య ఆధ్వర్యంలో పోలీసు కళాజాత నిర్వహిం చారు. బృందం సభ్యులు పాటలతో అందరినీ ఆకట్టుకు న్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన తర్వాతనే పిల్లలకు పెండ్లిలు చేయాలని సూచిం చారు. చిన్నతనంలో పెండ్లిలు చేయడం చట్టరీత్యా నేరం అన్నారు. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రజల రక్షణ తమ కర్తవ్యం అన్నారు. విద్యార్థులు చిన్న నాటి నుండే లక్ష్యాలను ఎంచుకుని ముందుకు సాగాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో ధారూర్ సీఐ అప్పయ్య, ధారూర్ ఎస్ఐ నరేందర్, గ్రామ సర్పంచ్ చంద్రకళ, ఉప సర్పంచ్ భారతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.