Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డ్రీమ్ పెద్దగా ఉండాలి
- కసి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యం
- వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
ఆత్మవిశ్వాసం, కష్టపడే స్వభావం ఉంటే ఏదైనా సాధ్యమని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ నిరుద్యోగ యువతకు గ్రూప్-2,3,4 ఉద్యోగాలకు అంబేద్కర్ భవన్లో మూడు నెలల పాటు నిర్వహించే ఉచిత శిక్షణా శిబిరాన్ని జిల్లా కలెక్టర్ గురువారం ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి అంబేద్కర్ చిత్ర పటా నికి పూలమాలు వేశారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఒకే సంవత్సరంలో 96 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కృషి చేస్తుందని, ఇట్టి సువర్ణ అవకాశాన్ని అందిపుచ్చుకొని మంచి ఉద్యోగం సాధించాలన్నారు. వివిధ కేటగిరీలో ఉన్న ఉద్యోగాల నిమిత్తం 25 లక్షల మంది సిద్ధమవుతున్నారని సూచించారు. పోటీకి భయపడకుండా ముందుకు వెళ్ళా లని కలెక్టర్ తెలిపారు. విశ్వాసంతో ఏదైనా సాధించాలనే తపన ఉంటే మన ముందు ఉండే సమస్యలు ప్రతిది చిన్న విషయమేనని, విశ్వాసంతో ముందుకెళితే ఏదైనా సాధించవచ్చని ఆయన అన్నారు. ఆర్థిక సమస్యలతో పాటు ఎన్ని సమస్యలు వచ్చినా మీ లక్ష్యాన్ని అధిగమించి విజయం వైపు పయనించినప్పుడే కల సార్ధకమవుతుందని తెలిపారు. చదువు అనేది నిజాయితీగా ఉండాలి తప్ప , చ దువులో నటిస్తూ.. మనల్ని మనం మోసం చేసుకోకూ డదని కలెక్టర్ హితవు పలికారు. మన లక్ష్యానికి ఇబ్బంది కలిగించే స్నేహితులను దూరం పెట్టాలని, ఉపయోగపడే వారిని దగ్గర తీయాలని సూచిస్తూ.. ఎప్పుడూ సబ్జెక్టులోనే జీవించాలని, ఎప్పుడు వాటిపైనే చర్చ ఉండాలని, అదే మ న సిలబస్ అయ్యి ఉండాలని, అప్పుడే లక్ష్యాన్ని చేరు కుంటామని కలెక్టర్ అన్నారు. అలాగే మొబైల్ వాడకాన్ని పూర్తిగా పక్కకు పెట్టాలని అప్పుడే చదువుకోవడానికి ఎక్కువ సమయం దొరుకుతుందని ఆయన సూచించారు. కసి, పట్టుదలతో చదివితే ఉద్యోగ సంపాదన సమస్యే కాదని కలెక్టర్ అన్నారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి మల్లేశం మాట్లాడుతూ గతంలో కోచింగ్ సెం టర్లు నడిపామని తెలిపారు. ముగ్గురు విద్యార్థులు ఎంపిక అయినట్టు తెలిపారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్డబ్ల్యూఓ లు ఉమాపతి, వీరానందం, ఎంపీడీవో సత్తయ్య, శ్రీ అనం త పద్మనాభ కళాశాల అధ్యాపకులు సోమయ్య, గోపాల్, హెచ్‌డబ్ల్యుఓలు శుక్లవర్ధన్ రెడ్డి, ఎం.రవీందర్, ప్రవీణ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.